హైదరాబాద్‌లో మునావర్‌ ఫారుఖీ కామెడీ షోకు అనుమతి

Munawar Fauqui: మునావర్‌ ఫారుఖీ కామెడీ షోకు పోలీసుల అనుమతి

Jyothi
Published on: 19 Aug 2022 1:55 PM IST
Police Green Signal to Munawar Fauqui Show
X

హైదరాబాద్‌లో మునావర్‌ ఫారుఖీ కామెడీ షోకు అనుమతి

Munawar Fauqui: మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. రేపు శిల్పకళావేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. మునావర్ షోకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. రేపు శిల్పకళా వేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story