షర్మిలకు పోలీసు కౌంటర్ వైరల్.. పని లేకపోతే గాడిదలు కాసుకోండి.. అదే చేస్తున్నాం మేడం..

YS Sharmila Vs Police: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri
Updated on: 24 April 2023 5:00 PM IST
Police Counters Sharimila, Says They are Rearing Donkeys
X

షర్మిలకు పోలీసు కౌంటర్ వైరల్.. పని లేకపోతే గాడిదలు కాసుకోండి.. అదే చేస్తున్నాం మేడం..

YS Sharmila Vs Police: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. సిట్ ఆఫీసుకు బయలుదేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో.. లోటస్ పాండ్‌లో హైడ్రామా నెలకొంది. అయితే.. షర్మిలను బయటకు రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయగా.. పోలీసుల వలయాన్ని దాటుకుని వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. పోలీసులు తన కారుకు అడ్డుగా నిలబడినా.. వాళ్లపైకి కారును పోనిచ్చారు. దీంతో.. ఆగ్రహానికి గురైన పోలీసులు.. డ్రైవర్‌ను కారు నుంచి బయటకు దింపేశారు. దీంతో.. కోపంతో ఊగిపోయిన షర్మిల.. డ్రైవర్‌ను బయటకు లాగిన ఎస్సై మీద చేయిచేసుకున్నారు.

ఈ పరిణామంతో.. సీన్ మొత్తం హీటెక్కిపోయింది. ఆమెను ఆపేందుకు వచ్చిన లేడీ కానిస్టేబుల్స్‌ను కూడా తోసేసి రచ్చ రచ్చ చేశారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. రోడ్డుపైనే బైఠాయించి షర్మిల నిరసన తెలిపారు. ఈ క్రమంలో.. షర్మిల పోలీసులపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. కాగా.. ఆమెకు ఓ పోలీసులు కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తనను హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటూ షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు. మీకు ఏ పని లేకపోతే గాడిదలను కాసుకోండి... అంటూ అక్కడే ఉన్న పోలీసుల మీదికి అంతెత్తున లేచారు. అయితే.. ఆమె మాటలన్ని విన్న కానిస్టేబుల్.. గాడిదలు కాసుకోండి పోయి... అన్న వెంటనే.. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా.. అదే చేస్తున్నాం మేడం అంటూ కౌంటర్ వేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story