పంజాగుట్ట పీఎస్‌లో రేణుకా చౌదరిపై కేసు.. యూనిఫాంను ఎలా గౌరవించాలో..

Chalo Raj Bhavan: హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరిపై కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 16 Jun 2022 6:50 PM IST
Police Complaint Against Renuka Chowdhury
X

పంజాగుట్ట పీఎస్‌లో రేణుకా చౌదరిపై కేసు.. యూనిఫాంను ఎలా గౌరవించాలో..

Chalo Raj Bhavan: హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్‌లో కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరిపై కేసు నమోదైంది. కాసేపట్లో ఆమెను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నారు పోలీసులు. ప్రస్తుతం గోల్కొండ పీఎస్‌లో రేణుకా చౌదరి ఉన్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయినట్లు సమాచారం. ప్రస్తుతం భట్టి గోశామహల్ పీఎస్‌లో ఉన్నారు.

అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తమ చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story