హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్‌లో సంచలన విషయాలు.. స్కూల్‌ పిల్లలతో డ్రగ్స్ సరఫరా.. డ్రగ్స్‌కి హీరోయిన్ల పేరుతో..

Hyderabad: హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 11 Jan 2022 4:30 PM IST
Representational image
X

Representational image

Hyderabad: హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్‌ పిల్లలతో డ్రగ్స్‌ను సరఫరా చేపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలో సప్లై చేసే డ్రగ్స్‌కి హీరోయిన్ల పేర్లతో కోడ్‌ లాంగ్వేజ్ సెట్‌ చేసుకున్నారు. కత్రినా, కరీనా, సల్మాన్ పేర్లతో ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటు హైదరాబాద్‌లో సప్లై చేసే డ్రగ్స్‌కి సినిమా పేర్లతో కోడ్ లాంగ్వేజ్ ఫిక్స్‌ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఆర్డిఎక్స్‌, ఎండీ, స్టఫ్, మాల్‌ పేర్లతో హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. గోవా, ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న డ్రగ్స్ వ్యాపారులు ఇక్కడ 5 రెట్ల లాభంతో అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే హైదరాబాద్ డ్రగ్స్ వ్యాపారంలో కీలంగా ఉన్న ఐదుగురు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు వేటాడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story