సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి

Sangareddy: *చిన్న కంజర్ల గ్రామ పరిధిలోని మామిడి తోటల కోడిపందాలు

Sriveni Erugu
Published on: 7 July 2022 7:54 AM IST
Police Attack on Chicken Betting Base in Patancheru of Sangareddy District
X

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి

Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. చిన్నకంజర్ల గ్రామ పరిధిలోని మామిడి తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీ అయ్యారు. ఇద్దరు నిర్వాకులను పోలీసులు అదుపులోకి తీసుసుకున్నారు. వీరి నుంచి 13 లక్షల 12 వేల 140 రూపాయల నగదు, 32 కోళ్లు, 26 వాహనాలను, 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 29 కోడి పందాల రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 60 మంది వరకు ఖరీదైన వాహనాలను వదిలి పారిపోయారని.. వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story