Chalo Raj Bhavan: రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

* ఇందిరాపార్క్‌ చుట్టూ బారికేడ్ల ఏర్పాటు * కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

Sandeep Reddy
Published on: 16 July 2021 2:08 PM IST
Chalo Raj Bhavan: రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

Chalo Raj Bhavan: ఇందిరాపార్క్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్నాచౌక్‌ నుంచి రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ర్యాలీగా బయల్దేరారు. అయితే.. ర్యాలీకి అనుమతిలేదని తేల్చిచెప్పిన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఇందిరాపార్క్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో.. కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్‌రెడ్డిని ఎత్తుకొని బారికేడ్లు దాటించే ప్రయత్నం చేశారు కార్యకర్తలు. అయితే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story