Shilpa: వ్యాపారవేత్త శిల్పా దంపతులు అరెస్ట్

Shilpa: 14రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం

Sandeep Eggoju
Published on: 27 Nov 2021 1:56 PM IST
Police Arrested the Shilpa Couple and Court Imposed 14 Days Remand
X

శిల్ప దంపతులకు 14 రోజుల రేమండ్ విధించిన కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Shilpa: వ్యాపారవేత్త శిల్ప, ఆమె భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇద్దిరికి 14రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాంతో శిల్పతో పాటు ఆమె భర్తను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు శిల్పపై ఫిర్యాదు నమోదైంది. దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా వసూలు చేసిన శిల్ప డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసులను ఆశ్రయించింది దివ్యరెడ్డి. డబ్బులు ఇవ్వాలని అడిగితే బౌన్సర్‌తో బెదిరించిందని, ప్రముఖుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు దివ్య రెడ్డి తెలిపింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story