Hyderabad: హైదరాబాద్‌ యాప్రాల్‌లో గంజాయి సాగు

* గోదావరి గార్డెన్‌లోని ఓ ఇంట్లో గంజాయి పెంచుతున్న కేటుగాళ్లు * ఏడు కుండీల్లో మొక్కలు నాటిన వైనం

Shilpa
Published on: 7 Nov 2021 1:51 PM IST
Police Arrested People Growing Cannabis Plants in Seven Large Pots at Yapral Rachakonda Commissionarate
X

హైదరాబాద్‌ యాప్రాల్‌లో గంజాయి సాగు(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో ఏదో మూల గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాప్రాల్‌లో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఏడు పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అల్వాల్ డిప్యూటీ MRO, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సమక్షంలో పంచనామ నిర్వహించి, మొక్కలను సీజ్ చేశారు. అనంతరం నిందితులను జవహార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Shilpa

Shilpa

Next Story