Jadcherla: పోలీస్‌స్టేషన్‌ లాకప్‌లో కోడిపుంజు.. ఎందుకో తెలుసా!

Jadcherla: పోలీస్‌స్టేషన్‌ లాకప్‌లో కోడిపుంజు.. ఎందుకో తెలుసా!

Jyothi
Published on: 11 July 2023 5:06 PM IST
Police Arrested Kodi Punju at Jadcherla Police Station
X

Jadcherla: పోలీస్‌స్టేషన్‌ లాకప్‌లో కోడిపుంజు.. ఎందుకో తెలుసా!

Jadcherla: నిందితులు ఉండాల్సిన పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో ఓ కోడి బందీ అయ్యింది. పోలీసులు వేసిన గింజలు తింటూ లాకప్‌లో కోడిపుంజు కూత పెడుతున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది. జడ్చర్ల మండలంలోని బురెడ్డిపల్లి శివారులో తరచుగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కరివేన గ్రామనికి చెందిన ఓ వ్యక్తి కోళ్ల దొంగతనం చేస్తూ గ్రామస్తులకు పట్టబడ్డాడు. ఆ వ్యక్తిని, కోడి పుంజును గ్రామస్తులు రెండు రోజుల క్రితం పోలీసులకు అప్పగించారు.

దీంతో జడ్చర్ల పోలీసులు ఆ వ్యక్తిని, కోడి పుంజును లాకప్‌లో వేసి విచారణ చేపడుతున్నారు. దీంతో గత రెండు రోజులుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లోనే కోడిపుంజు పోలీసులు వేస్తున్న గింజలు తింటూ కూతలు పెడుతుండడంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు అవాక్కౌతున్నారు. కోడి పుంజును బయట ఉంచితే కుక్కలు తినే ప్రమాదం ఉండటంతో లాకప్‌లో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. మొత్తానికి దొంగకు చిక్కిన కోడిపుంజు మాంసంగా మారాల్సింది పోయి.. దర్జాగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లాకప్‌లో పోలీసులు వేస్తున్న గింజలు తింటూ గడుపుతోంది.

Jyothi

Jyothi

Next Story