Hyderabad:విద్యార్థునుల ఫోటోలు మార్పింగ్ చేస్తున్న ముఠా

Police Arrested Four Accused
x

Hyderabad:విద్యార్థునుల ఫోటోలు మార్పింగ్ చేస్తున్న ముఠా

Highlights

Hyderabad:విద్యార్థునుల ఫోటోలు మార్పింగ్ చేస్తున్న ముఠా

Hyderabad: ఘట్‌కేసర్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మార్పింగ్‌ న్యూడ్‌ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రదీప్, లక్ష్మీగణపతి, సతీష్, దుర్గా ప్రసాద్, నలుగురు నిందితులు విజయవాడలోని ఓ ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్నారు. వీరు ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్ పేరిట వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేశారు. వీరు ఓ కాలేజీ విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. ఆమె ద్వారా అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ లో చేరారు. తరువాత అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని వారి ఫోన్లు హ్యాక్ చేసి డేటా మొత్తం దొంగతనం చేశారు.

అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి వాట్సాప్ లో పెట్టి బెదిరించారు. నగ్నఫోటోలు పంపాలని, నగ్న వీడియో కాల్స్ చేయాలని లేకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని విద్యార్థునులను బ్లాక్ మెయిల్ చేశారు.విద్యార్థునులు ఈ విషయాన్ని తల్లిదండ్రలకు దృష్టికి తీసుకెళడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై ఫోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories