నకిలీ ఐఏఎస్ సందీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Police arrested fake IAS Sandeep
x

నకిలీ ఐఏఎస్ సందీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Highlights

మాట్రిమొని సైట్ లో ఐఏఎస్ నంటూ నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్న సందీప్

హైదరాబాద్ లో ఫేక్ ఐఏఎస్ కం డాక్టర్ వ్యవహారం బయట పడింది. మ్యాట్రిమోని సైట్ లో తాను ఐఏఎస్ అని నమ్మించిన సందీప్ అనే వ్యక్తి ఓ యువతిని ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కర్నాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ గా చెప్పుకుంటూ చెలామణీ అయ్యాడు. తనకి ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండి గా చేస్తానని చెప్పి భార్యను నమ్మించాడు. వివిధ కారణాలు చెప్పి భార్య నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు.తరువాత అదనపుకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. సందీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories