హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్లు

Police Arrested A Gang Making Adulterated Ginger In Hyderabad
x

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్లు 

Highlights

Hyderabad: ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్‌తో మార్కెట్‌లో విక్రయాలు

Hyderabad: ఎటు చూసినా కల్తీ. గాలి, నీరు, పాలు, నెయ్యి, కూరాగాయలు. ఇలా కల్తీకి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ జనాల ప్రాణాలను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ఏది అసలు... ఏది నకిలీ తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇవాళ మరో కల్తీ అల్లం వెల్లుల్లి పరిశ్రమపై స్పెషల్ ఆపరేషన్ టీంలు దాడులు చేసింది. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ పరిశ్రమపై దాడులు చేసి సుమారు నాలుగు టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కల్తీ ఒక్క అల్లంవెల్లుల్లికే పరిమితం కాలేదు. ఐస్‌క్రీములు, చాక్లెట్లు, మసాలాలు, నూనెను పెద్ద ఎత్తున కల్తీ చేస్తూ జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పరిధిలోని RKపురంలో ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నా రమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకునేవాడు. ఆ తర్వాత దాన్ని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగే కనిపించేది. ఇలా నూనె కల్తీ చేయడంతో ఆరితేరిన రమేష్.. పెద్ద ఎత్తున నూనె తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని పక్కన ఉండే ఫ్రైడ్ దుకాణాల నిర్వాహకులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ఇంటిపై ఆకస్మిత తనిఖీలు నిర్వహించారు. పందికొవ్వుతో రమేష్ నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు

పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు. పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్, లేదా సింథటిక్ కలుపుతున్నారు కంత్రీగాళ్లు. సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది. అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ కృత్రిమ పాల వ్యాపారంలో కొత్త కొత్త పద్దతులు అవలంబిస్తూ జనాల ఆరోగ్యం పాడుస్తున్నారు. వ్యవసాయంలో వాడే యూరియా ఎరువులు, ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.

ఐస్‌క్రీములు, చాక్లెట్లు, మషాలాలు, నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా ఇంట్లోకి ఉపయోగించే సరుకులు, చిన్నారులు తినే వాటిపై కన్నేసిన కేటుగాళ్లు కల్తీకి తెరలేపారు. ప్రమాదకరమైన వాటితో, ఆకర్షించే ప్యాకింగ్లతో కల్తీ సరుకును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు.

కొద్ది రోజుల క్రితం సమ్మర్ సీజన్ కల్తీ కేటుగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ఐస్‌‌క్రీమ్ కల్తీకి పెద్ద ఎత్తున తెరలేపారు. అనూ ఫ్రోజెన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోడౌన్స్‌పై బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసుల దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న 15 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ప్రాడక్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్‌లు తయారు చేయడమే కాకుండా వాటిని కల్తీ కూడా చేస్తున్నట్లు చెప్పారు. అధికంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో నకిలీ ఐస్ క్రీమ్లను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూసగా ఉంటుంది. మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్, అరారోట్, రీ ఫైండ్ నూనె డాల్డాను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు. ఇటీవలి కాలంలో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేయిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం, తయారు చేసేందుకు ఈ కల్తీ నేయ్యిని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories