ఇవాళ నాంపల్లి కోర్టులో శేషన్నను హాజరుపర్చనున్న పోలీసులు

Police Arrest Gangster Nayeem Main Follower Sheshanna
x

ఇవాళ నాంపల్లి కోర్టులో శేషన్నను హాజరుపర్చనున్న పోలీసులు

Highlights

Hyderabad: నిన్న నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

Hyderabad: ఇవాళ నాంపల్లి కోర్టులో నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హాజరుపర్చనున్నారు పోలీసులు. నిన్న కొత్తపేట్‌లోని ఓ హోటల్లో సెటిల్‌మెంట్‌ చేస్తుండగా.. పక్కా సమాచారంతో శేషన్నను టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 9 MM పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. 2016 నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శేషన్నకు షాడో నయీం అనే పేరు కూడా ఉంది. శేషన్న కనుసన్నల్లోనే నయీం యాక్షన్‌ టీం ఆపరేషన్స్‌ జరిగినట్టు సమాచారం. నయీం డంప్‌ మొత్తం శేషన్న వద్ద ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. శేషన్న.. నయీంతో కలిసి హత్యలు, కబ్జాలు, సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories