Hyderabad: జూబ్లీహిల్స్ రేప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

Police are Investigating the Jubilee Hills Rape Case | Hyderabad News
x

Hyderabad: జూబ్లీహిల్స్ రేప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

Highlights

Hyderabad: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏ-1 సాదుద్దీన్‌ను విచారించనున్న పోలీసులు

Hyderabad: జూబ్లీహిల్స్ రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ను విచారించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంచల్‌గూడా జైలు నుంచి సాదుద్దీన్‌ను కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. మొదటి రోజు నిందితుడి ప్రొఫైల్ మైనర్స్‌తో ఎలా పరిచయం అయ్యారనే దానిపై నిందితుడిని ప్రశ్నించనున్నారు.

అసలు పబ్‌లో ఆ రోజు ఏం జరిగింది..? మైనర్‌ బాలికను ఎలా ట్రాప్ చేశారు..? పబ్‌కు ఎందుకు వెళ్లారు..? బెంజ్ కారు ఎవరిచ్చారనే దానిపై విచారించనున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. సాదుద్దీన్‌ను ప్రశ్నిస్తే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా సాదుద్దీన్‌ మేజర్. ప్రస్తుతం ఐదుగురు మైనర్లు జువైనల్ హోమ్‌లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories