TS High Court: ఎమ్మెల్యేల ఎర కేసులో టీఎస్‌ హైకోర్టులో పోలీసులు, బీజేపీ పిటిషన్‌లు

TS High Court: ఇవాళ విచారణకు రానున్న రెండు పిటిషన్‌లు

Jyothi
Updated on: 29 Oct 2022 1:45 PM IST
Police and BJP Petitions in High Court
X

TS High Court: ఎమ్మెల్యేల ఎర కేసులో టీఎస్‌ హైకోర్టులో పోలీసులు, బీజేపీ పిటిషన్‌లు

TS High Court: ఎమ్మెల్యేల ఎర కేసులో టీఎస్‌ హైకోర్టులో పోలీసులు, బీజేపీ పిటిషన్‌ దాఖలు చేశాయి. ముగ్గురు నిందితుల రిమాండ్‌ రిజెక్ట్‌పై పోలీసులు రివిజన్‌ పిటిషన్‌ వేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ.. నిందితులను రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. అటు.. ఫామ్‌హౌజ్‌ వ్యవహారంపై బీజేపీ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ వేశారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. ఈ పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. ఇక.. ఈ రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి.


Jyothi

Jyothi

Next Story