మావోయిస్టుల కదలికలపై అప్రమత్తమవుతున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా

మావోయిస్టుల కదలికలపై అప్రమత్తమవుతున్న పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా
x
Highlights

కొన్నాళ నుంచి నిశ్శద్భంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మావోయిస్టుల సంచారం పెరిగిపోయింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు మావోయిస్టుల...

కొన్నాళ నుంచి నిశ్శద్భంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మావోయిస్టుల సంచారం పెరిగిపోయింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు మావోయిస్టుల కదలికలపై శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిఘావేస్తున్నారు. కొన్ని వర్గాల వారు ఇచ్చిన సమాచారం మేరకు డ్రోన్ కెమెరాల సహాయంలో మావోయిస్టుల కదలికలపై పోలీసు అధికారులు ఆధారాలను కనుగొంటున్నారు. మావోయిస్టుల బృందం చత్తీస్ ఘడ్ కిష్టారాం పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాలోడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న చిన్న చెరువును దాటుతున్నట్లు డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు కనుగొన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ తెలంగాణ పోలీసు వ్యవస్థ ఇటు రాష్ట్ర పోలీస్ శాఖని అటు ఛత్తీస్‌ ఘడ్ పోలీసు విభాగాన్ని కూడా అప్రమత్తం చేసింది. డ్రోన్ కెమెరా సాయంతో పోలీసు అధికారులు కొన్ని వీడియోలను క్లిక్ చేశారు.

ఇక పోతే ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉంటూ మావోయిస్టుల క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారులతో చర్చలు కూడా జరిపారు. సెప్టెంబ‌ర్ 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా, మ‌హారాష్ర్ట స‌రిహ‌ద్దుల్లో ఏరియ‌ల్ సర్వే నిర్వ‌హించారు. శుక్ర‌వారం రాత్రి తిర్యాణి పోలీసు స్టేష‌న్‌ను డీజీపీ సంద‌ర్శించారు. గురు, శుక్ర‌వారాల్లో జిల్లా పోలీసు అధికారుల‌తో స‌మీక్షించారు. తిర్యాణి అటవీ ప్రాంతం కాబట్టి మావోయిస్టుల క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై తిర్యాణి పోలీసు స్టేష‌న్ సిబ్బందికి డీజీపీ మార్గ‌నిర్దేశం చేశారు. శ‌నివారం కూడా జిల్లా స్థాయి పోలీసు అధికారుల‌తో మార‌మూల అట‌వీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల‌పై చ‌ర్చించారు. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అటవీ ప్రాంతాల్లో పోలీసులు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై డీజీపీ చ‌ర్చించి దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ల నుంచి 11 మంది సభ్యులతో కూడిన బృందం మార్చిలో వచ్చినట్లు సమాచారం. రెండు నెలలుగా జిల్లాలో సంచరిస్తున్న ఐదుగురు సభ్యులతో కూడిన మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ బృందాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు డీజీపీ రెండు రోజులుగా జిల్లాలోని ఉన్నతస్థాయి అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక మరో వైపు రెండు నెలల్లోనే , భద్రాద్రి కొఠాగుడెం జిల్లాలో చాలా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ సెప్టెంబర్ 3 న తుది శ్వాస విడిచాడు. సెప్టెంబర్ 7 న జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ సమాచారంతో పోలీసు అధికారులు ములుగు, భద్రచలం, పినపాక, మథాని ప్రాంతాల్లో భద్రతను కఠినతరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories