Hyderabad: వరుస చైన్‌స్నాచింగ్‌ల నేపథ్యంలో పోలీసుల అలర్ట్

Hyderabad: హైదరాబాద్‌లో పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

Dhatripriya
Published on: 8 Jan 2023 9:01 AM IST
Police Alert After Series Of Chain Snatchings
X

Hyderabad: వరుస చైన్‌స్నాచింగ్‌ల నేపథ్యంలో పోలీసుల అలర్ట్

Hyderabad: హైదరాబాద్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వరుస చైన్ స్నాచింగ్ ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు స్నాచర్ల ఫొటోలతో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. బైక్ లపై ప్రత్యేక దృష్టి సారించారు. పలుచోట్ల తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో అలర్టయిన హైదరాబాద్ పోలీసులు ఉదయం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 బైకులను సీజ్ చేశారు పోలీసుల. పోలీసుల తనిఖీల్లో కొందరు మైనర్ యువకులు బైకులు నడుపుతూ పట్టుబడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story