ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు స్పీకర్‌ పోచారం

Pocharam Srinivas Reddy Coming in Special Helicopter From Banswada
x

ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు స్పీకర్‌ పోచారం

Highlights

Pocharam Srinivas Reddy: ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు స్పీకర్‌ పోచారం బయల్దేరారు.

Pocharam Srinivas Reddy: ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు స్పీకర్‌ పోచారం బయల్దేరారు. బాన్సువాడ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరారు స్పీకర్‌ పోచారం. బాన్సువాడలో బస్తీ దవాఖానా ప్రారంభించిన పోచారం మిగిలిన కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరారు. టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం నేపథ్యంలో హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పోచారం బయల్దేరారు. BRS ఆవిర్భావం నేపథ్యంలో పలు ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. అసెంబ్లీ రద్దు చేస్తారా.. లేక స్పీకర్‌కు ఆహ్వానం అందిందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కాసేపట్లో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. ప్రగతిభవన్‌ నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్‌తో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా తెలంగాణ భవన్‌ చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories