Etela Rajender: ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌ పోచారం

Etela Rajender: ఈటల రాజేందర్‌ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది.

Arun Chilukuri
Published on: 12 Jun 2021 2:32 PM IST
Pocharam Srinivas Reddy Accepted Etela Rajender Resignation Letter
X

Etela Rajender: ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌ పోచారం

Etela Rajender: ఈటల రాజేందర్‌ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. ఈటల రాజీనామాను ఆమోదించారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకొని స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎల్లుండి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story