ఎల్లుండి హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఎల్లుండి హైదరాబాద్‌కు ప్రధాని మోడీ
x
Highlights

ప్రధాని నరేంద్రమోడీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొని కరోనా...

ప్రధాని నరేంద్రమోడీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొని కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షించనున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అక్కడ్నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్లనున్నారు. ఇక, ప్రధాని మోడీ రాక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. హకీంపేట నుంచి భారత్ బయోటెక్ కంపెనీ వరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీపై మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

అయితే, ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఆకస్మికంగా ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలవేళ మోడీ నగరానికి వస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పర్యటనలో ఐదారు గంటలపాటు గడపనున్న ప్రధాని మోడీ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. అలాగే, GHMC ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు మోడీ పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఆకస్మికంగా హైదరాబాద్ లో పర్యటనకు రావడం ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories