Narendra Modi: ఆదిలాబాద్‌ జిల్లాలో రేపు ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం-ఎస్పీ గౌస్ ఆలం

Shekhar G
Updated on: 3 March 2024 5:57 PM IST
PM Modi Visit To Adilabad District Tomorrow
X

Narendra Modi: ఆదిలాబాద్‌ జిల్లాలో రేపు ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: తెలంగాణలో రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. రేపు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు మోడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం తమిళనాడుకు వెళ్లనున్న మోడీ.. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

రేపు రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు మోడీ. ఎల్లుండి ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి సంగారెడ్డి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం.. ఒడిశాకు బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ.

Shekhar G

Shekhar G

Next Story