PM Modi: కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి కావాలి

PM Modi Speech At Parade Grounds Public Meeting
x

PM Modi: కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి కావాలి

Highlights

PM Modi: నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి

PM Modi: సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కుటుంబపాలన అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు.

తెలంగాణ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందని.. తెలంగాణలో కుటుంబం పాలనతో అవినీతి పెరిగిందన్నారు. కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారంటూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు మోడీ

అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే అంటూ ధ్వజమెత్తారు. అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలని ప్రజలను కోరారు మోడీ. ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దని... అడ్డుకునేందుకు కొంత మంది అవినీతి పరులు సుప్రీంను ఆశ్రయించారని విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories