బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

Arun Chilukuri
Published on: 2 Dec 2020 1:04 PM IST
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్‌
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల స్థితిగతులపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై సంజయ్‌తో మోడీ ముచ్చటించారు. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా సహకరించారంటూ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తమకు అన్ని విషయాల్లో అండగా నిలబడతామని మోడీ హామీ ఇచ్చారు. అలాగే నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story