Modi Road Show: హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించిన మోడీ.. ప్రధానిపై పూలవర్షం కురిపించిన అభిమానులు

Modi Road Show: కాచిగూడలో వీర సావర్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని

Jyothi
Published on: 28 Nov 2023 8:24 AM IST
PM Modi Holds Mega Road Show In Hyderabad
X

Modi Road Show: హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించిన మోడీ.. ప్రధానిపై పూలవర్షం కురిపించిన అభిమానులు

Modi Road Show: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ప్రధాని హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో కాచిగూడ వరకు కొనసాగింది. ఈ రోడ్‌షోలో ప్రధానిమోడీతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ హాజరయ్యారు. వీరితోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో పోటీ చేస్తున్న 24 మంది బీజేపీ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. కాచిగూడ వరకు ర్యాలీ చేసిన ప్రధాని అనంతరం వీర సావర్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. రెండున్నర కిలోమీటర్ల పాటు సాగిన ప్రధాని రోడ్‌షోకు బీజేపీ, జనసేన కార్యకర్తలతో పాటు..భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ప్రధానిపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు.

Jyothi

Jyothi

Next Story