దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది : సీఎం కేసీఆర్

దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది : సీఎం కేసీఆర్
x
ప్రధాని మోది, సీఎం కేసీఆర్
Highlights

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి 9 రాష్ట్రాల సీఎంలతో మంగళవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసుల స్థితిని వివరించారు. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మందులు, పడకలు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచామని, ఐసీఎంఆర్‌, నీతిఆయోగ్‌, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని ప్రధానికి వివరించారు. కరోనా రికవరీ రేటు తెలంగాణలో 71శాతం, మరణాల రేటు 0.7శాతంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను బాగా పెంచామని ఆయన తెలిపారు.

కరోనా వైరస్‌లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులను నియమించడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపైనా ఆలోచించాలన్నారు. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా తట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. వైద్య రంగం బలోపేతానికి చొరవ తీసుకోవాలన్నారు. కరోనా అనుభవాలు మనందరికీ పాఠం లాంటిది నేర్పాయని కేసీఆర్ మోదీతో అన్నారు. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలోనూ విజనరీతో ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి అని కేసీఆర్‌ కోరారు. ఈ క్రమంలో దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories