PM Modi Video Conference : ఆ పది రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా బాధితులున్నారు

PM Modi Video Conference : ఆ పది రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా బాధితులున్నారు
x
Highlights

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.

PM Modi Video Conference : దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరోసారి 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడటం ద్వారా, దేశంలో కరోనా పరిస్థితిపై సమాచారం మరింత సమగ్రంగా తెలుస్తుందని ఆయన అన్నారు. కరోనాపై కేంద్రం చేసే పోరాటంలో సరైన దిశలో పయనించడానికి ఉపయోగపడుతుందన్నారు. నిరంతరం కలుసుకొని కరోనాపై చర్చించడం కూడా ముఖ్యమని, ఎందుకంటే కరోనా వల్ల కొత్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు.

ఆసుపత్రులపై ఒత్తిడి, ఆరోగ్య కార్యకర్తలపై ఒత్తిడి ఉన్నా, రోజువారీ పనులను చక్కపెట్టడంలో, వాటిని కొనసాగించడంలో ఎటువంటి మార్పు లేదన్నారు. వారు ప్రతిరోజూ కొత్త సవాలును ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నేడు దేశంలో 80 శాతం కరోనా వ్యాధి ఉన్న వారు ఈ పది రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. అందువల్ల కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఈ రాష్ట్రాల పాత్ర చాలా పెద్దదని పేర్కొన్నారు. నేడు దేశంలో వ్యాధి ఉన్న వారి సంఖ్య 6 లక్షలు దాటిందని, వీటిలో చాలా వరకు కేసులు ఈ పది రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. అందుకే ఈరోజు పది రాష్ట్రాల సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ సమావేశం అవసరమైందని స్పష్టం చేసారు.

ఈ సమావేశానికి పది రాష్ట్రాలు ముఖ్యమంత్రులు హాజరయ్యారని, అందరూ కలిసి సమీక్ష జరిపి కరోనాను ఎదుర్కొనడం పై చర్చించి ఒకరి అనుభవాల నుండి మరొకరు చాలా నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ పది రాష్ట్రాల్లో కరోనాను ఓడించినప్పుడే కరోనా పై పోరాటంలో దేశం కూడా గెలుస్తుందన్నారు. దేశంలో ప్రతి రోజు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 7 లక్షలకు చేరుకుందని ఆయన స్పష్టం చేసారు. నిరంతరం టెస్ట్ ల సంఖ్య పెరుగుతోందని, పది రాష్ట్రాలలో కరోనా వైరస్ సంక్రమణను గుర్తించండని తెలిపారు. కరోనా వైరస్ ని వ్యాప్తిచెందకుండా ఆపకుండా ఆపాలన్నారు. మనదేశంలో సగటు మరణాల రేటు ముందు ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉంది ఇది సంతృప్తికరమైన విషయమన్నారు. దేశంలో మరణాల రేటు నిరంతరం తగ్గుతోందని, దేశంలో కరోనా వ్యాధితో ఉన్న వారి శాతం తగ్గింది, రికవరీ రేటు పెరిగిందని తెలిపారు. కాబట్టి కరనా పై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రయత్నాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని రుజువు అవుతున్నాయని దీని అర్థమన్నారు. ఇది ప్రజలలో నమ్మకాన్ని కూడా పెంచింది, విశ్వాసం పెరిగింది, మరియు భయం కూడా తగ్గిందన్నారు. ఎక్కడ రాష్ట్రాలలో కరోనా పరీక్షల రేటు తక్కువ,మరియు పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న చోట,పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా...బీహార్, గుజరాత్, యుపి, పశ్చిమ బెంగాల్, తెలంగాణలలో నేటి ఈ సమీక్షలో, పరీక్షల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories