SC Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌‌న్యూస్..

SC Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 26 July 2021 5:23 PM IST
Platform Ticket Fare Reduced Across All Stations of Secunderabad Division of SCR
X

SC Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌‌న్యూస్..

SC Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ సమయంలో పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టికెట్‌ ధరలను తగ్గిస్తూ ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగనుంది.

ప్రస్తుతం డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో (నాన్‌ సబర్బన్, సబర్బన్) ప్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలు రూ.10కి తగ్గనున్నాయి. అయితే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్లలో మాత్రం ప్లాట్‌ఫారం ధర రూ.20 ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అన్‌ రిజర్వుడు ఎక్స్‌ప్రెస్, సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా అన్ని కొవిడ్‌-19 ప్రొటోకాల్స్‌ను పాటించాలని ప్రయాణికులను కోరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story