ఫలించిన ప్లాస్మా థెరపీ.. ఉత్సాహంలో గాంధీ వైద్యాలు

ఫలించిన ప్లాస్మా థెరపీ.. ఉత్సాహంలో గాంధీ వైద్యాలు
x
Gandhi Hospital (File Photo)
Highlights

చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయినా వైద్యులు కరోనా బాధితులకు వైద్యం అందించి రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న బాధితులకి కూడా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదిస్తున్నరు గాంధీ ఆస్పత్రి వైద్యులు.

పూర్తి వివరాల్లోకెళ్తే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్స నిర్వహించేందుకు మే నెలలో అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతు ఉన్న ఆరుగురి బాధితులను గుర్తించి వారి కేస్‌షీట్లతోపాటు పూర్తి వివరాలను ఐసీఎంఆర్‌కు పంపించారు. కాగా వారిలో ఒకరిని ప్లాస్మా థెరపీ చికిత్స కోసం సెలెక్ట్‌ చేసింది.

ఈ మేరకు గాంధీ వైద్యులు మే 14వ తేదీన వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల వయసు గల కరోనా బాధితునికి 200 ఎంఎల్‌ ప్లాస్మా ద్రావణాన్ని ఐసీఎంఆర్‌ నిపుణుల సూచనల మేరకు ఎక్కించారు. కాగా ఆ రోగి కొంత మేర కుదుట పడడంతో 16 వ తేదీన రెండో దఫా ప్లాస్మాను 200 ఎంఎల్‌ ఎక్కించారు. దీంతో బాధితుడు పూర్తిస్థాయిలో కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా అతన్ని ఓ వారం రోజులు గాంధీ వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచి మళ్లీ ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ నెల 30వ తేదీన డిశ్చార్జ్‌ చేసినట్లు సమాచారం.

ఆ తరువాత గాంధీ వైద్యులు ప్రాణాపాయస్థితిలో వున్న మరో ఇద్దరు కరోనా బాధితులకు ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు ప్లాస్మా థెరపీ చికిత్సలు అందించారు. దీంతో ఆ ఇద్దరు కరోనా బాధితులు కూడా పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని, రెండు, మూడు రోజుల్లో వారిని కూడా డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. ఇక గాంధీ వైద్యులు ప్లాస్మాథెరపీ చికిత్సలు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో ఉత్సాహం వెల్లివిరుస్తోందని ఓ వైద్యాధికారి సంతోషం వ్యక్తం చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories