PJR Daughter Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్

PJR Daughter Vijaya Reddy: దివంగత పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

Arun Chilukuri
Published on: 23 Jun 2022 2:59 PM IST
PJR Daughter Vijaya Reddy Joins In Congress
X

PJR Daughter Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్

PJR Daughter Vijaya Reddy: దివంగత పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్‌లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని ఆమె అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story