కాసేపట్లో చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి పైలట్‌ రోహిత్‌రెడ్డి

* తనపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి సవాల్‌

R Tripura Malini
Published on: 17 Dec 2022 10:23 AM IST
Pilot Rohit Reddy To Visit Charminar BhagyaLaxmi Temple
X

కాసేపట్లో చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి పైలట్‌ రోహిత్‌రెడ్డి

Pilot Rohit Reddy: కాసేపట్లో చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయానికి ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి చేరుకోనున్నారు. తనపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్పందించారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తనకు సంబంధం ఉందంటూ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను రోహిత్‌రెడ్డి ఖండించారు. ఈడీ నోటీసుల విషయం బండి సంజయ్‌కు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. యాదాద్రి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు బండి సంజయ్‌ రావాలన్నారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి అధికారులు ఎవరూ విచారణకు పిలవలేదని పైలట్‌ రోహిత్‌రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌కు సవాల్‌ చేయడానికి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తున్నానని ఆయన చెప్పారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story