వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్

High Court: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2021 5:13 PM IST
Pil Filed In Telangana High Court on Venkatarami Reddy
X

వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్

High Court: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జే.శంకర్‌లు పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారన్న పిటిషనర్లు వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే, ఇవాళ అత్యవసర విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story