Warangal: సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యంగుడు.. సామాన్యుల పాలిట దేవుడంటూ..

Warangal: వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటానికి ఓ దివ్యంగుడు పాలాభిషేకం చేశాడు.

Arun Chilukuri
Published on: 11 Feb 2023 11:47 AM IST
Physical Challenged Gur Pours Milk to Warangal CPs Flexi
X

Warangal: సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యంగుడు.. సామాన్యుల పాలిట దేవుడంటూ..

Warangal: వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటానికి ఓ దివ్యంగుడు పాలాభిషేకం చేశాడు. కాశీబుగ్గ జంక్షన్‌లో నివాసముంటున్న దివ్యాంగుడైన అసద్‌కు కొంత భూమి ఉంది. అయితే.. ఆ భూమిని ఇదే ప్రాంతానికి చెందిన యాదగిరి అనే గల్లీ లీడర్ కబ్జా చేశాడు. ఇదే విషయమై పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన స్థలం తనకు ఇప్పించాలంటూ పెద్దపెద్ద వాళ్ల కాళ్లు పట్టుకున్నాడు. అయినా కూడా తన భూమి తనకు దక్కలేదు. సుమారు 10 సంవత్సరాల నుండి అసద్ యాదగిరి పై పోరాడుతూనే ఉన్నాడు.

అయితే.. ఇదే సమయంలో వరంగల్ జిల్లాలోకి సీపీ రంగనాథ్ ఎంట్రీ ఇచ్చారు. సీపీ రంగంలోకి దిగుతూనే భూకబ్జాదారులపై కొరడా ఝళిపించారు. సీపీ రంగనాథ్ ని కలిసి తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు అసద్‌. విచారణకు ఆదేశించిన సీపీ నకిలీ పత్రాలతో యాదగిరి ఈ వికలాంగుడి భూమిని కబ్జా చేశాడని నిర్ధారణకు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. పోలీసుల స్పందనకు కృతజ్ఞతగా కమిషనర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు అసద్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story