Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బిగ్ షాక్.. డీఎస్పీ నుంచి సీఐగా డిమోషన్!

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 4 Feb 2026 12:05 PM IST
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బిగ్ షాక్.. డీఎస్పీ నుంచి సీఐగా డిమోషన్!
X

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను డీఎస్పీ హోదా నుంచి ఇన్‌స్పెక్టర్ (సీఐ) హోదాకు డిమోట్ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసిన ప్రణీత్ రావు, నిబంధనలకు విరుద్ధంగా పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం ట్యాపింగ్ చేయడమే కాకుండా, విచారణ సమయంలో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కంప్యూటర్ హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారనే అభియోగాలు కూడా ఆయనపై ఉన్నాయి.

సాధారణంగా పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్లు లేదా బదిలీలు జరుగుతుంటాయి. కానీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారిని తిరిగి సీఐ హోదాకు తగ్గిస్తూ (Demotion) ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు మరికొందరు ఉన్నతాధికారులను పోలీసులు విచారించారు. ప్రణీత్ రావు నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా ఈ కేసులో లోతైన దర్యాప్తు సాగుతోంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ రావుపై డిమోషన్ వేటు పడటంతో, ఈ కేసులో తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story