Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: రేపు లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: రేపు లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
x
Highlights

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) కీలక మలుపు తిరిగింది.

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు రేపు (శుక్రవారం) పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు నేడు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే:

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయిన తర్వాత పోలీసులు అతన్ని శారీరకంగా హింసించకూడదని (ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దని) కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ప్రభాకర్‌రావు రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ లొంగుబాటు తర్వాత కేసు విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories