Top
logo

ఈఎస్‌ఐ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ

ఈఎస్‌ఐ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ
Highlights

-ఈఎస్‌ఐ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ -నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ -దేవికారాణితో పాటు ఆరుగురిని కస్టడిలోకి తీసుకున్న ఏసీబీ -చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌కు తరలింపు -రెండ్రోజుల పాటు విచారించనున్న అధికారులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. దేవికా రాణితో పాటు మరో ఆరుగురిని కాసేపటి క్రితం కస్టడీలోకి తీసుకోంది. చంచల్‌గూడ జైలులో ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంజారాహిల్స్‌కి తరలించారు. నిందితులను రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ జరుగనుంది. మరోవైపు ఈ స్కామ్‌లో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్‌ చేయగా...మరికొంత మందిని అదుపులోకి తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story