వరంగల్‌లో బీజేపీ సభకు అనుమతి రద్దు

Warangal BJP Meeting: ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ సభకు ఏర్పాట్లు

Jyothi
Published on: 26 Aug 2022 11:29 AM IST
Permission Cancelled for BJP Meeting in Warangal
X

వరంగల్‌లో బీజేపీ సభకు అనుమతి రద్దు

Warangal BJP Meeting: వరంగల్‌లో బీజేపీ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి రద్దయ్యింది. ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. దీంతో సభను ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిని రద్దు చేసింది కళాశాల యాజమాన్యం. సభకు పోలీసుల అనుమతి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే.. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపును పురస్కరించుకొని వరంగల్‌లో సభను నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story