Seethakka: మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆలోచించాలి

Seethakka: పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నాయి

Shashank Gullapelli
Published on: 10 April 2024 8:08 PM IST
People Should Think About The Conspiracies Of Modi Government Says Seethakka
X

Seethakka: మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆలోచించాలి

Seethakka: రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై దేశ, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. చాయ్ వాలాగా చెప్పుకొనే మోడీ ఛాయ్ అమ్మిన రైల్వేస్టేషన్‌ను నిర్మించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు సీతక్క... పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చుతూ... మనదేశ స్థాయిని తగ్గించడమే కాకుండా,ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్న దేశంలో మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story