Peddapalli: పెద్దపల్లి జిల్లాలో టీకాల కోసం ఎగబడిన జనం

Peddapalli: జీలకుంట వ్యాక్సినేషన్ సెంటర్‌ దగ్గర ఉద్రిక్తత * రోజుకు 150 టోకెన్లు మాత్రమే ఇస్తున్న అధికారులు

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 6:12 PM IST
People Demand to Increase Vaccine Doses in Peddapalli
X
పెద్దపల్లి జిల్లాలో వాక్సినేషన్ కోసం ఎగబడ్డ జనం (ఫైల్ ఇమేజ్)

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని జీలకుంట వ్యాక్సిన్‌ సెంటర్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచీ వ్యాక్సిన్ టోకెన్‌ల కోసం గ్రామ పంచాయతీ దగ్గర గ్రామస్తులు బారులుతీరారు. అయితే, రోజుకు 150 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు.. పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు చూసైనా రోజువారీ వ్యాక్సిన్‌ల సంఖ్యను పెంచాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story