తెలంగాణ బీజేపీలో ఈటల దుమారం.. మరో ఉప్పెన తప్పదంటూ పెద్దిరెడ్డి వార్నింగ్‌

Peddireddy opposes Etela Rajenders entry into BJP
x

ఈటల రాజేందర్‌(ఫైల్ ఇమేజ్ )

Highlights

Telangana: తెలంగాణ బీజేపీలో ఈటల దుమారం రేగుతోంది.

Telangana: తెలంగాణ బీజేపీలో ఈటల దుమారం రేగుతోంది. ఈటల రాజేందర్‌ రాకను ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈటల‌ బీజేపీలోకి వస్తారన్న వార్తలతో ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అయినా, తనను కాదని ఈటలను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదన్నారు. నన్ను సంప్రదించకుండా ఈటలను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారు? ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చే నేతలకు ఈటల విషయం నాకు చెప్పడానికి ఏంటి బాధ? అంటూ పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ ఫామ్ హౌస్‌లో చర్చలు జరిపినప్పుడు కూడా నేను గుర్తు రాలేదా? అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

అయినా, స్థానిక ప్రతినిధినైన నన్ను సంప్రదించకుండా ఈటలతో ఎలా చర్చలు జరుపుతారని పెద్దిరెడ్డి నిలదీశారు. ఈటల విషయంలో ఒక్కసారి కూడా నన్ను సంప్రదించకపోవడం శోచనీయం అన్నారు. అయినా, ఒక వర్గం మాత్రమే ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో, ఈటల విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories