Dasari Manohar Reddy: దళితబంధు పథకం కోసం డబ్బులు డిమాండ్ చేస్తే చెప్పులతో కొట్టండి

Dasari Manohar Reddy: అర్హులైనవారికి తప్పకుండా ఇస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హామీ

Jyothi
Published on: 26 Aug 2023 10:41 AM IST
Peddapalli MLA Dasari Manohar Reddy Key Comments
X

Dasari Manohar Reddy: దళితబంధు పథకం కోసం డబ్బులు డిమాండ్ చేస్తే చెప్పులతో కొట్టండి

Dasari Manohar Reddy: దళితబం‎ధు పథకం మంజూరు కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే చెప్పులతో కొట్టాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి. జిల్లాలోని ఓదెలలో పర్యటించిన ఆయనను గ్రామంలోని దళితులు అడ్డుకున్నారు. దళితబంధు పథకం అందరికీ మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.అయితే పథకం మంజూరు చేస్తామని కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పథకం కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే బట్టలూడదీసి కొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో అర్హులైన వారికే పథకం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story