Peddapalli Jawan Died in Terror Attack: జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి.. పెద్దపల్లి జవాన్ మృతి

Peddapalli Jawan Died in Terror Attack: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరో జవాన్ మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాలిగం శ్రీనివాస్(28) వీరమరణం పొందినట్లుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు

Krishna
Published on: 7 July 2020 7:13 AM IST
Peddapalli Jawan Died in Terror Attack:   జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి.. పెద్దపల్లి జవాన్ మృతి
X
Peddapalli Jawan Died in Terror Attack

Peddapalli Jawan Died in Terror Attack: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరో జవాన్ మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాలిగం శ్రీనివాస్(28) వీరమరణం పొందినట్లుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం జవాన్ కుటుంబసభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. దేశం పైన ప్రేమతో 2013 లో ఆర్మీలో చేరాడు శ్రీనివాస్..

శ్రీనివాస్ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అతనికి తల్లిదండ్రులతో పాటు ఒక తమ్ముడు భార్య మమత ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ తండ్రి పశువుల కాపరి పనిచేస్తూ ఉండగా, అతనితమ్ముడు రాజు తాపీమేస్త్రి పని చేస్తున్నాడు. ఇక శ్రీనివాస్ మృతితో రామగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల చైనాతో జరిగిన హింసాత్మక పోరులో సంతోష్ బాబు వీర మరణం మరువక ముందే మరో జవాన్ ని కోల్పోవడం నిజంగా భాదాకరం..

Krishna

Krishna

Next Story