Telangana: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన NSUI, PDSU నేతలు

PDSU Leaders Who Tried To Besiege The Assembly
x

Telangana: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన NSUI, PDSU నేతలు

Highlights

Telangana: 5,300 కోట్ల పెండింగ్ లో ఉన్న ఫీస్ రి అంబర్స్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్

Telangana: తెలంగాణ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పలు సంఘాల నేతలు ముట్టడికి యత్నించడం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పీడీఎస్‌యూ, NSUI నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న వారిని వచ్చినట్టే అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. అయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు అసెంబ్లీకి వస్తుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అల్మాస్గూడలో గ్రీన్ జోన్ ఎత్తివేయాలని NSUI నేతలు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చిన NSUI నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పీడీఎస్‌యూ కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాదిగా వచ్చి పీడీఎస్‌యూ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న 5వేల300కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్‌ఈ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని..హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు పీడీఎస్‌యూ సంఘం నేతలను అరెస్ట్ చేశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories