Gandhi Bhavan: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పీసీసీ సమావేశం

Gandhi Bhavan: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Sept 2024 5:57 PM IST
PCC meeting at Gandhi Bhavan, Hyderabad
X

Gandhi Bhavan: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పీసీసీ సమావేశం

Gandhi Bhavan: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పీసీసీ సమావేశమైంది. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. జిల్లాల వారీగా కాంగ్రెస్‌ నేతలతో టీపీసీసీ చీఫ్‌ సమీక్షిస్తున్నారు. ముందుగా వరంగల్‌ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో టీపీసీసీ చీఫ్‌ భేటీ అయ్యారు.

పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలపై వారితో చర్చిస్తున్నారు. ఇక.. ఈ సమీక్షా సమావేశానికి AICC ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, AICC కార్యదర్శి విశ్వనాథన్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story