Revanth Reddy: ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే.. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి..

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‎కు బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 23 Nov 2022 8:31 PM IST
PCC Chief Revanth Reddy Writes An Open Letter To CM KCR
X

Revanth Reddy: ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే.. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి..

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‎కు బహిరంగ లేఖ రాశారు. పోకలగూడెంలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం దారుణమన్నారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోందని, శ్రీనివాసరావు హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేతగానితనంతోనే ఫారెస్ట్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోడు సమస్యలపై మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story