Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి..

PCC Chief Revanth Reddy Reacts On High Court Orders To CS Somesh Kumar
x

Revanth Reddy: సోమేష్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలి..

Highlights

Revanth Reddy: సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ నియామకం చెల్లదని మేం మొదట నుంచి చెబుతూనే ఉన్నామన్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ నియామకం చెల్లదని మేం మొదట నుంచి చెబుతూనే ఉన్నామన్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తాజాగా సీఎస్‌ను ఏపీ కేడర్‌కే వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్‌ఏ, రెరాకు హెడ్‌గా సోమేష్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కాగా నేడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఆయనను ఏపీకి వెళ్లాలని, అంతకు అవసరమైతే ఏపీ సర్కార్ అనుమతి తీసుకొని తెలంగాణలో పని చేయాలని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కోర్టు తీర్పుపై సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories