Mahesh Kumar Goud: పెహల్గాం ఘటన మోదీ, అమిత్‌షా పెయిల్యూర్‌కి నిదర్శనం

Mahesh Kumar Goud: పెహల్గాం ఘటన మోదీ, అమిత్‌షా పెయిల్యూర్‌కి నిదర్శనం
x
Highlights

Mahesh Kumar Goud: పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించేది కేవలం రాజకీయ కార్యక్రమం అని పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

Mahesh Kumar Goud: పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించేది కేవలం రాజకీయ కార్యక్రమం అని పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. రాజకీయ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుందని విమర్శించారు. విలీనం, విమోచనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. విలీనోత్సవాన్ని విమోచనం అని వల్లభాయ్‌ పటేల్‌ నిర్ణయాన్ని తిరగరాస్తున్నారని.. ఆయనని అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి విమోచన దినం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పెహల్గాం ఘటన మోదీ, అమిత్‌షా పెయిల్యూర్‌కి నిదర్శనమన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. టూరిస్ట్‌లు తిరిగే ప్రదేశంలో మిలటరీ ఫోర్స్‌ను ఎందుకు వెనక్కి పంపారని అమనుమానం వ్యక్తం చేశారు. పెహల్గాం సంఘటనలో కేంద్రం ఉదాసీనత కనిపిస్తుందన్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీసీసీఐ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు అన్ని సంఘటనలను రాజకీయానికి వాడుకున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. రాజకీయమే పరమావధిగా బీజేపీ చూస్తుందని పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories