జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందిన సైనికులకు జనసేనని సెల్యూట్

జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందిన సైనికులకు జనసేనని సెల్యూట్
x
Highlights

జమ్మూ కశ్మీర్ మాచిల్ సెక్టార్‌లో వీర మరణం పొందిన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కట్టడి చేసే క్రమంలో మన సేనల నుంచి నలుగురు జవాన్లు అసువులు బాయడం బాధాకరమన్నారు

జమ్మూ కశ్మీర్ మాచిల్ సెక్టార్‌లో వీర మరణం పొందిన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేశారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కట్టడి చేసే క్రమంలో మన సేనల నుంచి నలుగురు జవాన్లు అసువులు బాయడం బాధాకరమన్నారు. దేశ భక్తితో, తెగింపుతో వీర సైనికులు చేసిన పోరాటం అందరూ గుర్తు పెట్టుకుంటారన్నారు. వీర మరణం పొందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వీర జవాన్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొని, అండగా నిలవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు.. ఆ కుటుంబాలలో వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు అయన ఓ లేఖను ట్వీట్ చేశారు..

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కట్టడి చేసే క్రమంలో మన సేనల నుంచి నలుగురు అసువులు బాయడం బాధాకరం. దేశ భక్తితో, తెగింపుతో జమ్మూ కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌ లో వీర సైనికులు చేసిన పోరాటం అందరూ గుర్తుపెట్టుకొంటారు. వారికి నా తరఫున, జనసేన తరఫున శాల్యూట్‌ చేస్తున్నాను. వీర మరణం పొందిన వారిలో ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ చీకల ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి గారు, శ్రీ ర్యాడా మహేష్‌ గార్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి గారు గత 18ఏళ్లుగా సైన్యంలో సేవలు చేస్తున్నారు. తన ప్రాంత యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన శ్రీ ర్యాడా మహేష్‌ గారు తొలి నుంచి ఆర్మీలో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకొని సైన్యంలో సేవలు చేస్తున్నారు. మనతెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి గారు, శ్రీ మహేష్‌ గార్లు ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడకుండా చూపిన తెగువను ఎవరూ మరచిపోరు.

ఈ వీర జవాన్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకొని, అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నాను. ఆ కుటుంబాలలో వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories