Pawan Kalyan: కొండగట్టుకు చేరుకున్న పవన్‌కల్యాణ్

Pawan Kalyan: అభిమానులకు పవన్‌కల్యాణ్ అభివాదం

Dhatripriya
Updated on: 24 Jan 2023 12:03 PM IST
Pawan Kalyan Reached Kondagattu
X

Pawan Kalyan: కొండగట్టుకు చేరుకున్న పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు బయల్దేరారు. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న పవన్‌ తన ప్రచార రథం 'వారాహి'కి అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించనున్నారు. వేద పండితులు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేనాని సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్‌ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్‌ కొండగట్టు పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story