షర్మిల పార్టీపై స్పందించిన జనసేనాని
షర్మిల రాజకీయ పార్టీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు.
తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. 'ప్రతీ ఒక్కరూ పార్టీ పెట్టుకోవచ్చు. షర్మిలా ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా. కేసీఆర్ పాలన గురించి హైదరాబాద్‌లోనే మాట్లాడతా' అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజీగా గడిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ మంగళవారం రాత్రి హోంమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు.
Next Story




