Pawan Kalyan: తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. ఈ సారి పోటీకి దిగాలన్న యోచనలో..

Pawan Kalyan: ఈ సారి పోటీ దిగాలన్న యోచనలో పవన్ కల్యాణ్

Jyothi
Updated on: 19 Jun 2023 10:32 AM IST
Pawan Kalyan Focus on Telangana
X

Pawan Kalyan: తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్

Pawan Kalyan: తెలంగాణలోనూ బీజేపీతోనే పవన్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని పోటీకి దూరంగా ఉంచిన పవన్ ఓట్లు మాత్రం బీజేపీకి వేయాలని సూచించారు. అయితే ఇప్పుడు 26 నియోజకవర్గాలపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి ప్రయోజనం లేదని పవన్ తెలంగాణ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో పవన్ పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఎవరికి నష్టం..? ఎవరికి లాభమన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. తెలంగాణలో సైతం బీజేపీతోనే ముందుకు వెళితే పవన్‌కు కమలం నేతలు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ప్రస్తుతం ఇంఛార్జ్‌లను నియమించిన 26 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా..? అక్కడ బీజేపీకి బలమైన అభ్యర్థులుంటే పరిస్థితి ఏంటన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story